రైతులు దళారులకు అమ్మకుండా తేమ శాతం తక్కువగా ఉంచి ఐకెపి సెంటర్లలో ధాన్యం అమ్మాలని గ్రామ మహిళా సంఘం అధ్యక్షురాలు గీత బుధవారం సూచించారు. నాగర్ కర్నూల్ జిల్లా పరిధిలోని గగ్గలపల్లి గ్రామంలో ఐకెపి ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గ్రామ మహిళా సంఘం అధ్యక్షులు, ప్రజాప్రతినిధులు, రైతులు, స్థానిక నాయకులు, తదితరులు పాల్గొన్నారు.