పేద విద్యార్థులెవరూ చదువుకు దూరం కాకూడదని కేంద్రం ఇటీవల ‘పీఎం విద్యాలక్ష్మి’ పథకానికి ఆమోదం తెలిపింది. అయితే ఈ పథకం ద్వారా విద్యార్థులు రూ.7.50లక్షల వరకు బ్యాంకుల ద్వారా రుణం పొందవచ్చు. దేశవ్యాప్తంగా 860 విద్యాసంస్థల్లో ప్రవేశాలు పొందిన విద్యార్థులకు కేంద్రం హామీతో ఈ రుణం లభించనుంది. ఈ రుణంలో 75 శాతం వరకు కేంద్ర ప్రభుత్వం గ్యారంటీ ఇవ్వనుంది. రూ.8 లక్షలలోపు వార్షిక ఆదాయం ఉన్నవారు ఈ పథకానికి అర్హులు.