మలి దశలో పెన్షన్ కోరుకునే వారు జీవనధారా-2 అనే పెన్షన్ పథకాన్ని ఎంచుకోవచ్చు. ఎక్కువ మొత్తంలో పెన్షన్ కావాలంటే ఎక్కువ యాన్యుటీని కొనుగోలు చేయాలి. ఈ పాలసీ రెగ్యులర్, సింగిల్ ప్రీమియం (ఒకేసారి చెల్లించాలి) ఆప్షన్లలో వస్తోంది. సింగిల్ లైఫ్‌తో పాటు జాయింట్ లైఫ్ యాన్యుటీ కవరేజీ ఆప్షన్ కూడా ఉంది. ఈ పాలసీలో చేరేందుకు కనీస వయసును 20 ఏళ్లుగా నిర్ణయించారు. ఏడాది నుంచి 15 ఏళ్ల డిఫర్‌మెంట్ పీరియడ్ ఉంటుంది.