కేంద్రమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌తో BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భేటీ అయ్యారు. అమృత్ పథకంలో అక్రమాలు జరుగుతున్నాయని మంత్రికి ఫిర్యాదు చేశారు. అమృత్ పథకం టెండర్లలో సీఎం రేవంత్ తన బావమరది సృజన్ రెడ్డికి లాభం వచ్చేలా స్కాం చేశారని ఖట్టర్‌కి ఇప్పటికే లేఖ రాశారు. తాజాగా ఢిల్లీలోని శాస్త్రి భవన్‌లో కేంద్ర మంత్రిని నేరుగా కలిసి ఈ విషయంపై ఫిర్యాదు చేశారు.