పోటీలో కోట్ల విజయభాస్కర్ రెడ్డి కుమారుడు ప్రకాశ్ రెడ్డి

63பார்த்தது
పోటీలో కోట్ల విజయభాస్కర్ రెడ్డి కుమారుడు ప్రకాశ్ రెడ్డి
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు రెండు సార్లు కాంగ్రెస్ తరపున ముఖ్యమంత్రిగా పని చేసిన కోట్ల విజయభాస్కర్ రెడ్డి కుమారుడు మాజీ కేంద్ర మంత్రి కోట్ల జయసూర్యప్రకాశ్ రెడ్డి డోన్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరపున 2024 ఎన్నికల బరిలో ఉన్నారు. ఈయన 2004, 2009 ఎన్నికల్లో కర్నూలు లోక్‌సభ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. కాంగ్రెస్ హయాంలో ఆయన రైల్వే శాఖ సహాయ మంత్రిగా పని చేశారు.

தொடர்புடைய செய்தி