వైద్యశాలలో రికార్డులను పరిశీలించిన జిల్లా వైద్యాధికారి
టేకులపల్లి మండలంలోని సులానగర్ ప్రభుత్వ ప్రాథమిక వైద్యశాలలో రికార్డులను జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి డాక్టర్ బాలాజీ ఆకస్మికంగా తనిఖీ సోమవారం చేశారు. వైద్యశాలలో అందుతున్న సేవల గురించి రోగులను అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్య కార్యక్రమాలకు సంబంధించిన రికార్డులను పరిశీలించిన, అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో సిబ్బందికి తగు సూచనలు చేశారు.