ఇల్లెందు వ్యవసాయ మార్కెట్ నూతన చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన బానోత్ రాంబాబును ఎమ్మెల్యే కోరం కనకయ్య సోమవారం శాలువాతో ఘనంగా సత్కరించారు. అనంతరం నూతన చైర్మన్ కు ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలిపారు. ఇల్లెందు వ్యవసాయ మార్కెట్ అభివృద్ధి కోసం కృషి చేయాలని సూచించారు. అదే విధంగా మార్కెట్ అభివృద్ధిలో తన సహాయ సహకారాలు అందిస్తానని పేర్కొన్నారు.