ప్రజా విజయోత్సవాలపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రచార రథాన్ని శుక్రవారం ఇల్లందు మున్సిపల్ కార్యాలయం వద్ద మున్సిపల్ ఛైర్మన్ దమ్మలపాటి వెంకటేశ్వరరావు జెండా ఊపి ప్రచార రధాన్ని ప్రారంభించారు. మున్సిపల్ ఛైర్మన్ మాట్లాడుతూ ఇల్లందు మున్సిపాలిటీ పరిధిలో ప్రచార రథం ద్వారా ప్రభుత్వ సంక్షేమ పథకాలను విస్తృతంగా వివరించడం జరుగుతుందని తెలిపారు.