పిడిఎస్యు ఆధ్వర్యంలో నిర్వహించే విద్యార్థి అమరవీరుల వర్ధంతి సభలను జయప్రదం చేయాలని పీడీఎస్యు రాష్ట్ర సహాయ కార్యదర్శి గోకినపల్లి మస్తాన్ అన్నారు. సోమవారం ఇల్లందు ఈఫ్ట్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నాటి బిఆర్ఎస్ ప్రభుత్వం నుంచి నేటి కాంగ్రెస్ ప్రభుత్వం వరకు రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య రోజురోజుకు పెరుగుతుందని అన్నారు. నిరుద్యోగుల సమస్యలను ప్రభుత్వాలు పరిష్కరించాలని పేర్కొన్నారు.