కాంగ్రెస్ ప్రభుత్వం పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్లను విడుదల చేయాలని టిఎన్ఎస్ఎఫ్ జిల్లా నాయకులు చందావత్ రమేష్ నాయక్ అన్నారు. శుక్రవారం ఇల్లందు పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్లు విడుదల కాకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి స్కాలర్షిప్లను విడుదల చేయాలని అన్నారు.