ఇల్లందు మండలంలోని మామిడి గుండాల గ్రామంలోని పంట పొలాలను శనివారం ఐటీడీఏ పీవో రాహుల్, ఫారెస్ట్ అధికారులు, విద్యుత్ శాఖ అధికారులతో కలిసి పరిశీలించారు. అనంతరం స్థానిక గిరిజన రైతుల యొక్క సమస్యలను ఐటిడిఏ పిఓ అడిగి తెలుసుకున్నారు. గిరిజనుల పంట పొలాలకు కరెంటు లైన్ వేయాలంటే కొంత ఫారెస్ట్ భూమి ఆటంకంగా ఉందని, కరెంటు లైన్ కోసం 25 స్తంభాలు కావాలని స్థానిక రైతులు ఐటీడీఏ పీవోను కోరారు.