పినపాక బీసువారిగూడెం అటవీ ప్రాంతంలో కోడిపందేలు నిర్వహిస్తున్నారన్న సమాచారంతో ఆ స్థావరంపై శుక్రవారం పినపాక పోలీసులు దాడి చేశారు. ఈ దాడుల్లో నలుగురు వ్యక్తులు, నగదుతో పాటు నాలుగు ద్విచక్ర వాహనాలను అదుపులోకి తీసుకున్నట్లు ఎస్సై రాజ్ కుమార్ తెలిపారు. మరికొందరు పరారీలో ఉన్నట్లు తెలిపారు.