వాడవాడలలో మే డే వేడుకలు

563பார்த்தது
వాడవాడలలో మే డే వేడుకలు
బూర్గంపాడు మండలంలో బుధవారం మేడే కార్మిక దినోత్సవాన్ని పలు గ్రామాల్లోని వాడవాడల్లో ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలోని భారతిభవన్ లో భవన నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో కార్మిక జెండా రెపరెపలాడింది. ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మిక సంఘ అధ్యక్షులు ప్రభాకర్, రాములు, కార్మిక సంఘ ముఖ్య సలహాదారులు నాగమురళి, వెంకటేశ్వర్లు, రాంబాబు, ఉపాధ్యక్షులు రామకృష్ణ, కార్మిక సంఘం సభ్యులు కృష్ణ, ఏసు, వెంకన్న పాల్గొన్నారు.