గిరిజన విద్యార్థుల పట్ల అధికారులు చిన్నచూపు చూస్తున్నారు అని ఏఐఎస్ఎఫ్ జిల్లా సహా కార్యదర్శి ఈసంపల్లి పవన్ సాయి అన్నారు. మంగళవారం అశ్వాపురం మండల ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. మండలంలోని గొందిగూడెం గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థులు సమస్యలతో ఇబ్బందులు పడుతున్న అధికారులు పట్టించుకోవడం లేదని అన్నారు. వెంటనే ఐటిడిఏ అధికారులు స్పందించి సమస్యలు పరిష్కరించాలని అన్నారు.