పురుగు మందు తాగిన ఓ మహిళ చికిత్సపొందుతూ సోమవారం మృతిచెందింది. పాల్వంచ మందరికపాడు గ్రామానికి చెందిన కాటి సాంబలక్ష్మి(43) వ్యవసాయ కూలీ. గత రెండేళ్లుగా థైరాయిడ్, కడుపు నొప్పి సమస్యతో బాధపడుతోంది. ఈ నెల 24న తీవ్రమైన కడుపు నొప్పి రావడంతో తట్టుకోలేక పురుగుమందు తాగింది. పాల్వంచ తరలించగా అక్కడ చికిత్సపొందుతూ మృతి చెందింది. భర్త నర్సింహారావు ఫిర్యాదు మేరకు ఎస్సై సురేశ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.