పాల్వంచ కేటీపీఎస్ ఐదో దశ కర్మాగారంలోని తొమ్మిదో యూనిట్లో సోమవారం రాత్రి 7 గంటలకు విద్యుదుత్పత్తిలో అంతరాయం ఏర్పడింది. బాయిలర్ ట్యూబ్ లీకు కావడంతో అధికారులు ఉత్పత్తిని నిలిపివేశారు. ఈ కర్మాగారం ఉత్పత్తి సామర్థ్యం 250 మెగావాట్లు. సీఈ ప్రభాకర్‌రావు తెలిపారు. మంగళవారం రాత్రి నాటికి మరమ్మతులు పూర్తిచేసి యూనిట్‌ను రాష్ట్ర గ్రిడ్‌కు అనుసంధానం చేస్తామన్నారు.