పాల్వంచ పట్టణంలో మాల మహానాడు జిల్లా నాయకులు రమణమూర్తి ఆధ్వర్యంలో సోమవారం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో భాగంగా డీసీఎంఎస్ ఛైర్మన్ కొత్వాల శ్రీనివాస్‌తో మాలల మహా పాదయాత్రకు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. ఎస్సి వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా మాలల ఆధ్వర్యంలో ఈనెల 25న మహా పాదయాత్ర నిర్వహిస్తున్నట్లు జిల్లా నాయకులు రమణమూర్తి పేర్కొన్నారు.