సీపీఐ అనుబంధ ఎస్ఎఫ్ఎడబ్ల్యు మహిళా సమైక్య జిల్లా జనరల్ బాడీ సమావేశం చంద్రకళ అధ్యక్షతన సోమవారం కొత్తగూడెం సీపీఐ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా కార్యదర్శి మున్నా లక్ష్మి కుమారి మాట్లాడారు. మహిళా సమాఖ్య సభ్యత్వ నమోదు సకాలంలో పూర్తిచేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వర్కింగ్ ప్రెసిడెంట్ పద్మజ, ఆర్గనైజర్ సెక్రటరీ రత్నకుమారి, సహాయ కార్యదర్శి ధనలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.