తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ, హైదరాబాద్ వారి ఆదేశాల ప్రకారం బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన క్యాంపెన్ లో భాగంగ సోమవారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి జి. భానుమతి స్థానిక కొత్తగూడెంలోని రెసిడెన్షియన్స్ హోటల్స్, లాడ్జిను ఆకస్మిక తనికి చేశారు. 18 సంవత్సరాల లోపు పిల్లలను పనిలో పెట్టుకున్నట్లయితే బాల కార్మిక చట్టం ప్రకారం పనిలో పెట్టుకున్న యజమానిపైన కేసు నమోదు చేస్తామని అన్నారు.