కొత్తగూడెం, పాల్వంచ పట్టణాలు పరిసర గ్రామాలను కలుపుతూ ప్రభుత్వం జారీ చేసిన జీవో 177 ను ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని సేవాలాల్ సేన జిల్లా అధ్యక్షులు ధరావత్ సురేష్ నాయక్ శనివారం డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంగా ఏజెన్సీ చట్టాలను తూట్లు పొడుస్తూ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు దిశగా అడుగులు వేయడం వల్ల ఏజెన్సీ గిరిజన ప్రజలకు తీరని అన్యాయం జరుగుతుందని పేర్కొన్నారు.