ఆదివాసి సంక్షేమ పరిషత్ కొత్తగూడెం డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో అడిషనల్ కలెక్టర్ కు కలెక్టరేట్లో సోమవారం వినతి పత్రాలు అందజేశారు. జీవో ఎంఎస్ నంబర్ 33ను ఏజెన్సీ ప్రాంతాల్లో నిలుపుదల చేయాలని, అలాగే ఏజెన్సీ ప్రాంతంలో రియల్ ఎస్టేట్ దందాలపై చర్యలు తీసుకోవాలన్నారు. ఏజెన్సీలో గిరిజనులపై జరుగుతున్న దాడులను అరికట్టాలని డిమాండ్ చేశారు.