బీమా, ప్రమాద బీమా సౌకర్యంతో స్త్రీనిధి రుణాల లబ్దిదారులకు భరోసా లభిస్తుందని కలెక్టర్ జితేశ్ వి. పాటిల్ అన్నారు. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో కలెక్టరేట్లో సోమవారం అవగాహన కల్పించారు. మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు బాతులు, నాటు కోళ్లు, కంజు పిట్టలు, పుట్టగొడుగుల పెంపకంపై దృష్టి సారించాలన్నారు. సామగ్రి, జాలీలు, పరికరాల తయారీకి ఐటీఐ విద్యార్థులను ప్రోత్సహించాలన్నారు.