కొత్తగూడెంలో ఈనెల 21, 22, 23 తేదీల్లో జరిగే ఐద్వా రాష్ట్ర 4వ మహాసభలను జయప్రదం చేయాలని ఐద్వా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు బుగ్గవిటీ సరళ శనివారం పిలుపునిచ్చారు. యుటీఎఫ్ కార్యాలయంలో సరళ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం చెప్పిస్తున్న మనివాద సిద్ధాంతానికి వ్యతిరేకంగా పోరాటాలు జరుపుతామని అన్నారు. మనివాద సిద్ధాంతాల ముసుగులో స్త్రీలను తిరిగి వంట ఇంటికి పరిమితం చేసి, వివక్షకు గురిచేయాలని చూస్తోందని అన్నారు.