జిల్లాలో మారుమూల గిరిజన ప్రాంతాలకు ఇంటర్నెట్, నాణ్యమైన 4జీ సేవల సరఫరాకు తగిన సహకారం అందించాలని డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికాం తెలంగాణ ఇన్ఛార్జి ఎస్. తారాచంద్ కలెక్టర్ జితేశ్ వి పాటిల్ ను కోరారు. జిల్లాలో బీఎస్ఎన్ఎల్, టి-ఫైబర్ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న మొబైల్ సిగ్నల్ టవర్లపై శనివారం కలెక్టరేట్ లో నిర్వహించిన సమీక్ష సమావేశం ఆయన మాట్లాడారు.