దేశం కోసం, ప్రజల రక్షణ కోసం అమరులైన పోలీస్ కు నివాళులు అర్పించేందుకు ప్రతి సంవత్సరం నిర్వహించే స్మృతి పరేడ్ ను కొత్తగూడెం పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో ఘనంగా నిర్వహించారు. స్మృతి పరేడ్ లో జిల్లా కలెక్టర్ జితేష్ వి పటేల్, జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్, జిల్లా పోలీస్ సిబ్బంది పాల్గొని నివాళులు అర్పించారు. కలెక్టర్ మాట్లాడుతూ పౌరుల రక్షణ కోసం నిరంతరం శ్రమించేది పోలీస్ మాత్రమే అన్నారు.