కొత్తగూడెం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు కార్పొరేషన్ ఆవిర్భావానికి పునాది అని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. నగరపాలక సంస్థ ఏర్పాటుకు సాగిస్తున్న పోరాటంలో ఇది తొలి విజయంగా అభివర్ణించారు. క్యాంపు కార్యాలయంలో శనివారం జరిగిన సమావేశంలో కూనంనేని మాట్లాడుతూ కూడాతో సంతృప్తి పడేది లేదన్నారు. కార్పొరేషన్ ఏర్పాటయ్యే వరకు ప్రయత్నం విరమించుకోబోమన్నారు.