చుంచుపల్లి పంచాయతీలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా ప్రత్యేకాధికారి సురేంద్రమోహన్ కలెక్టర్ జితేశ్ వి. పాటిల్ తో కలిసి మంగళవారం తనిఖీ చేశారు. ధాన్యం తరలించిన రైతులతో మాట్లాడారు. సన్న రకం ధాన్యానికి ప్రభుత్వం బోనస్ ఇస్తుందని, బోనస్ పొందాలంటే నిబంధనలు పాటించాలని సూచించారు. మద్దతు ధర కల్పించేందుకు ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందని కలెక్టర్ తెలిపారు.