ఛత్తీస్ గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లాలో ఇద్దరు మావోయిస్టు సానుభూతిపరులను పోలీస్ అధికారులు గురువారం అరెస్టు చేశారు. చింతాల్నార్ ప్రాంతానికి చెందిన మంతోష్ మండల్, నర్గాజున్ అనే ఇద్దరు మావోయిస్టు సానుభూతిపరులు కొంతకాలంగా మావోయిస్టులకు సహకరిస్తున్నారు. పేలుడు పదార్థాలను, మొబైల్స్, సిమ్‌కార్డులు తదితర సామగ్రిని వీరి వద్ద నుంచి పోలీస్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.