కార్తీక సోమవారం సందర్భంగా భద్రాచలం రామాలయం ఆధ్వర్యంలో గోదావరికి హారతి అందించారు. ఆలయం నుంచి ఊరేగింపుగా నది వద్దకు చేరుకుని ప్రత్యేక పూజలు చేశారు. నదికి పసుపు, కుంకుమ సమర్పించారు. మంత్రోచ్చారణ మిన్నంటగా లోకం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ వైదిక బృందం గోదారమ్మకు హారతి అందజేసింది. ఏర్పాట్లను ఈఓ రమాదేవి పర్యవేక్షించారు.