గత ప్రభుత్వం చేసిన తప్పు వల్లనే డబుల్ బెడ్ రూమ్ ముంపుకు ప్రధాన కారణమని అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ అన్నారు. సోమవారం అశ్వారావుపేట మండల కేంద్రంలోని ముంపుకు గురైన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను ఆయన పరిశీలించారు. దశల వారీగా సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. వరదల సమయంలో అధికారుల సూచనలు పాటిస్తూ సహకరించాలని కోరారు.