కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 11 నెలలు అవుతున్న ఒక్క హామీని కూడా అమలు చేయలేదని అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే మెచ్చ నాగేశ్వరరావు అన్నారు. ఆరు గ్యారెంటీ పథకాలు అమలు చేయాలని ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తున్న బీఆర్ఎస్ నేతలపై రాష్ట్ర ప్రభుత్వం తప్పుడు కేసులు పెడుతూ ఇబ్బందులకు గురి చేస్తుందని అన్నారు. రాష్ట్రంలో పరిస్థితులు ఇలానే కొనసాగితే నక్సలైట్లు పుట్టుకొస్తారని పేర్కొన్నారు.