కాగజ్నగర్ పట్టణం ఎస్పీఎం మిల్లులో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల నిర్వహణకు కసరత్తు మొదలైంది. మిల్లు పునఃప్రారంభమైన తర్వాత ఎన్నికలు జరుగుతుండడంతో కార్మికుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. మిల్లులోని 15 గుర్తింపు సంఘాలు తమ సంవత్సర నివేదికలను అందజేయాలని డీసీఎల్ సునిత లేఖలు పంపించడంతో ఆయా సంఘాలు నివేదికల తయారీలో నిమగ్నమయ్యాయి. మరో వైపు తమ సంఘం తరపున ఎవరిని బరిలో దింపాలనే దానిపై సైతం కసరత్తు చేస్తున్నాయి.