కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ మండలం ఆరెగూడ గ్రామంలో నూతన పత్తి కొనుగోలు కేంద్రాన్ని సోమవారం జిల్లా పరిషత్ మాజీ ఛైర్మన్ కోనేరు కృష్ణారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. రైతులు తాము పండించిన పత్తిని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించి ప్రభుత్వం అందిస్తున్న మద్దతు ధరను పొందాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల మాజీ ఎంపీపీ శంకరయ్య, గ్రామ పెద్దలు, రైతులు, అధికారులు తదితరులున్నారు.