ప్రభుత్వ పాఠశాలలలో విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు పోషక విలువలు కలిగిన ఆహారాన్ని అందించాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. మంగళవారం జిల్లాలోని వాంకిడి మండల కేంద్రంలో గల గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలను ఆకస్మికంగా సందర్శించి, మధ్యాహ్నం భోజనం, గదులు, వంటశాల, మూత్రశాలలు, పాఠశాల పరిసరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యమైన పోషక విలువలు కలిగిన ఆహారాన్ని అందించాలన్నారు.