బాలికల విద్య, ఆరోగ్యం అంశాలపై ప్రత్యేక దృష్టి సారించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో అదనపు ఎస్పీ ప్రభాకర్ రావు, ఆసిఫాబాద్ నియోజకవర్గ శాసనసభ్యులు కోవ లక్ష్మి, జిల్లా సంక్షేమ శాఖ అధికారి భాస్కర్ లతో కలిసి జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ బాలికల దినోత్సవం కార్యక్రమానికి హాజరయ్యారు.