లోక్ సభ ఎన్నికల్లో ఓటర్లు నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకోవటానికి వారిలో భరోసా కల్పించటానికి వాంకిడి మండల కేంద్రంలో పోలీసు కవాతును నిర్వహించినట్లు ఆసిఫాబాద్ డీఎస్పీ సదయ్య పేర్కొన్నారు. 50 కేంద్ర బలగాలతో కలిసి స్థానిక పోలీసులు ఆదివారం ఉదయం 10గంటలకు వాంకిడి మండల కేంద్రంలోని వీధుల గుండా కవాతును నిర్వహించారు. ఎక్కడైనా సమస్యాత్మక ఘటనలు చోటు చేసుకుంటే వెంటనే పోలీసు ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వాలని కోరారు.