రాళ్లపేటలో పారిశుధ్య సమస్యలు పరిష్కరించాల్సిందిగా డివైఎఫ్ఐ డిమాండ్

59பார்த்தது
రాళ్లపేటలో పారిశుధ్య సమస్యలు పరిష్కరించాల్సిందిగా డివైఎఫ్ఐ డిమాండ్
రెబ్బెన మండలం వంకులం గ్రామ పంచాయతీ రాళ్లపేట గ్రామంలో పారిశుధ్యం పనులు చేపట్టాలని డివైఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి ఆత్మకూరు సతీష్ డిమాండ్ చేశారు. సోమవారం గ్రామంలో పర్యటించిన ఆయన, చెత్తకుండిలులేక రోడ్డుపై చెత్త పేరుకుపోయిందని, అంగన్వాడి సెంటర్ వద్ద చెత్త నిల్వ ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామ ప్రజలు ఈ సమస్యపై అధికారులకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోకపోవడంతో వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు.

தொடர்புடைய செய்தி