ఆదివాసీల సంస్కృతికి ప్రత్యేక గుర్తింపు లభించిందని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవా లక్ష్మి, జిల్లా కలెక్టర్ వేంకటేశ్ దౌత్రె అన్నారు. మంగళవారం ఆసిఫాబాద్ కలెక్టరేట్ లో దండారీ ఉత్సవాల్లో భాగంగా చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. దండారీ ఉత్సవాల్లో ఆదివాసీ గిరిజన సంక్షేమ కోసం ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తుందని, ఈ సంవత్సరం కూడా చెక్కులు పంపిణీ చేయడం జరిగిందని అన్నారు.