ఆసిఫాబాద్ జిల్లా రాజ్ గోండ్ సేవాసమితి అధ్యక్షులు పెందుర్ సుధాకర్ పలు సమస్యలను ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ దండే విఠల్ ఆదివారం దృష్టికి తీసుకురాగా ఎమ్మెల్సీ సానుకూలంగా స్పందించారు. సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘాల జిల్లా నాయకులు పాల్గొన్నారు.