ఆసిఫాబాద్ మండలంలోని చిర్రకుంట గ్రామానికి చెందిన కోట శివయ్య సహోదరీ అనుమక్క అనారోగ్యంతో బాధపడుతూ హైదారాబాద్ లోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా, విషయం తెలుసుకున్న భాజపా సీనియర్ నాయకుడు, మాజి జడ్పీటిసి అరిగెల నాగేశ్వరావు బుధవారం ఆసుపత్రికి వెళ్లి ఆమెను పరామర్శించారు. అనంతరం వైద్యులతో మాట్లాడి ఆమెకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. వారి వెంట అనిల్, సాయి కుమార్ లు ఉన్నారు.