కొమరం భీం జిల్లాలో బుధవారం నుండి జరుగు ఇంటర్మీడియట్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా మాధ్యమిక విద్యాశాఖ అధికారి ఎన్. శంకర్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలోని విద్యార్థులకు హాల్ టికెట్లు అందజేశామన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నామన్నారు. విద్యార్థులు సకాలంలో పరీక్ష కేంద్రాలకు చేరాలని సూచించారు.