దివంగత సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి లేకపోతే దేశంలో ఇండియా కూటమి ఏర్పడేదే కాదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చెప్పిన విషయాన్ని ఆ పార్టీ నాయకులు గుర్తుంచుకుని వ్యవహరించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం సూచించారు. కొణిజర్ల మండలం చిన్నమునగాలలో సోమవారం జరిగిన సమావేశంలో మాట్లాడారు. అప్పులు చేయడంలో బీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్ పార్టీ మించిపోయిందని తెలిపారు.