మద్యం అక్రమ రవాణా చేపడుతూ పట్టుబడిన రెండు ద్విచక్ర వాహనాలకు కారేపల్లి ఎక్సైజ్ సర్కిల్ కార్యాలయంలో గురువారం సింగరేణి ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ శాఖ ఆధ్వర్యంలో అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ (ఏఈఎస్) వేణుగోపాలరావు గురువారం వేలం పాట నిర్వహించారు. ఒక్క ద్విచక్రవాహనానికి మాత్రమే ముగ్గురు పాటాదారులు డిపాజిట్లు చెల్లించి వేలంలో పాల్గొనగా సూర్యతండా గ్రామానికి చెందిన వినాయక్ వాహనాన్ని దక్కించుకున్నాడు.