ఊరచెరువు కట్టకు పొంచి ఉన్న ప్రమాదం

78பார்த்தது
గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు కల్లూరు మండలం పేరువంచ గ్రామపంచాయితీ వద్ద ఊర చెరువుకు భారీగా వరద నీరు చేరుకుంది. ఈ వరద ప్రవాహం వల్ల ఊర చెరువు కట్టకు బీటలు వారిందని స్థానికులు చెప్పారు. ఈ ఊర చెరువు కట్ట తెగితే వందలాది ఎకరాల్లో పంట నష్టం వాటిల్లుతుందన్నారు. సంబంధిత శాఖ అధికారులు ఊర చెరువును సందర్శించి ముందస్తు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

தொடர்புடைய செய்தி