ఆరోగ్య సమస్యలపై ప్రజలు అవగాహన పెంచుకోవాలని, మంచి ఆహార అలవాట్లతో పాటు పరిశుభ్రత పాటిస్తే రోగాలు దరిచేరవని ఎమ్మెల్యే డా. మట్టా రాగమయి అన్నారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా సోమవారం సత్తుపల్లి పట్టణంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆద్వర్యంలో నిర్వహించిన 2కే రన్‌లో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఓల్డ్ సెంటర్ నుండి ప్రభుత్వ ఆసుపత్రి వరకు వైద్యులతో కలిసి రన్ లో పాల్గొని విజేతలకు బహుమతులు అందజేశారు.