ఆళ్లపల్లి: వ్యవసాయ పనులు చేస్తుండగా పాము కాటు
ఓ రైతు పాము కాటుకు గురైన ఘటన ఆళ్ళపల్లి మండలంలో గురువారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం పెద్దూరుకి చెందిన రైతు గణపతి వ్యవసాయ పనులకు వెళ్లాడు. అక్కడ పాము కాటు వేసింది. దాంతో కుటుంబ సభ్యులు అతడిని ఆళ్ళపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారు. ఆసుపత్రిలో పాము కాటుకు విరుగుడు మందు ఇచ్చి, మెరుగైన వైద్యం కోసం కొత్తగూడెం రిఫర్ చేశామని వైద్యురాలు తెలిపారు.