కరకగూడెం మండలం తుమ్మలగూడెం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఇంట్లో టేకు కలపను ఎటువంటి అనుమతి లేకుండా నిల్వ చేసుకున్నాడు. విశ్వసనీయ సమాచారంతో అటవీ అధికారులు మంగళవారం తనిఖీలు నిర్వహించారు. నిందితతుడిపై కేసు నమోదు చేయించి ఆ ఇంట్లో నిల్వ ఉన్న అనుమతిలేని టేకు కలపను ఏడూళ్లబయ్యారం అటవీశాఖ కార్యాలయానికి తరలిస్తున్నట్లు ఫారెస్ట్ సెక్షన్ అధికారి గోవింద్ తెలిపారు.