కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై భారాస కార్యకర్తలు, నాయకులు ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని భారాస జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు సూచించారు. మణుగూరులో గురువారం భారాస ముఖ్య కార్యకర్తల, నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రేగా కాంతారావు మాట్లాడారు. వచ్చే ఎన్ని కలు ఏవైనా కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించిన హామీలను ప్రజలకు వివరించాలన్నారు.