ఏపీఎస్ఆర్టీసీ కీలక ప్రకటన చేసింది. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే సీనియర్ సిటిజన్లకు 25 శాతం రాయితీ ఇవ్వనున్నట్లు వెల్లడించింది. ఏ రాష్ట్రానికి చెందిన వారైనా, ఏ ఆర్టీసీ బస్సులోనైనా ఈ రాయితీ పొందవచ్చని పేర్కొంది. సీనియర్ సిటిజన్లకు 60 ఏళ్ల వయసు ఉండాలి. ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఓటర్ ఐడీ, రేషన్ కార్డు, సీనియర్ సిటిజన్ ఐడీల్లో ఏదైనా ఒకటి చూపించాల్సి ఉంటుంది. ఫిజికల్ లేదా డిజిటల్ రూపంలోనైనా చూపించవచ్చని ఏపీఎస్ఆర్టీసీ తెలిపింది.