నేటి బాల బాలికలే రేపటి భావిభారత పౌరులని ఎస్సై గంజి స్వప్న పేర్కొన్నారు. గురువారం బాలల దినోత్సవం పురస్కరించుకొని చంద్రుగొండ మండలం మద్దుకూరులో గో ఇండియా ట్రస్ట్ నిర్వహించిన బాలల దినోత్సవం వేడుకలలో పాల్గొని పిల్లలను ఉద్దేశించి మాట్లాడారు. చక్కగా చదువుకొని ఉన్నత విద్యను అభ్యసించాలని తద్వారా ఉన్న ఊరికి కన్న తల్లిదండ్రులకు గుర్తింపు తేవాలన్నారు. ఈ సందర్భంగా ట్రస్ట్ నిర్వాహకులను అభినందించారు.